అల్లూరి జిల్లాలో కుప్పకూలిన ‘రెడ్ వింగ్’ మెడికల్ డ్రోన్

అల్లూరి జిల్లాలో కుప్పకూలిన ‘రెడ్ వింగ్’ మెడికల్ డ్రోన్

27/March/2026 10:39    Share:   

పాడేరు/జి.మాడుగుల, మార్చి 27: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్రోన్ ప్రయోగాల్లో ప్రమాదం చోటుచేసుకుంది. జి.మాడుగుల మండలం బొయితిలి సమీపంలో ‘రెడ్ వింగ్’ (Red Wing) సంస్థకు చెందిన ఒక భారీ డ్రోన్ అదుపు తప్పి కుప్పకూలింది.
మండల కేంద్రం నుంచి గిరిజన గ్రామాలకు మందులు, రక్త నమూనాలు మరియు ఇతర అత్యవసర వైద్య పరికరాలను చేరవేసే లక్ష్యంతో ప్రభుత్వం ‘రెడ్ వింగ్’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా శుక్రవారం నిర్వహించిన ట్రయల్ రన్ (Trial Run) లో సాంకేతిక లోపం తలెత్తింది. గాలిలో ప్రయాణిస్తుండగా అదుపు తప్పిన ఈ భారీ డ్రోన్, బొయితిలి గ్రామ పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో చెట్లపై పడిపోయింది.ప్రస్తుతం రెడ్ వింగ్ సంస్థ ప్రతినిధులు మరియు సాంకేతిక నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదానికి గల సాంకేతిక కారణాలను విశ్లేషిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా కష్టాలను అధిగమించేందుకు ప్రవేశపెట్టిన ఈ ‘సంజీవని’ డ్రోన్ సేవల్లో ఇటువంటి ఆటంకాలు కలగడం గిరిజన ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.
Breaking News

Subscribe our Newsletter