ఏలూరు జిల్లా పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారమే ప్రధమ ప్రాధాన్యత : ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్

ఏలూరు జిల్లా పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారమే ప్రధమ ప్రాధాన్యత : ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్

18/April/2026 07:13    Share:   

ఏలూరు, 17 ఏప్రిల్ 2026 (శుక్రవారం):
ఏలూరు జిల్లా పోలీస్ సిబ్బంది సంక్షేమం మరియు వారి సమస్యల సత్వర పరిష్కారానికి జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుబడి ఉంటుందని, ఇది తమకు ప్రథమ ప్రాధాన్యత అని ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌరవ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు శుక్రవారం (17.04.2026) ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో "పోలీస్ సిబ్బంది సంక్షేమ దివాస్" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు మరియు విభాగాలలో పనిచేస్తున్న సివిల్ పోలీస్, ఏఆర్ సిబ్బంది, మరియు హోమ్ గార్డ్స్ పాల్గొని తమ శాఖాపరమైన మరియు వ్యక్తిగత సమస్యలను ఎస్పీ గారి దృష్టికి తీసుకువచ్చారు.సిబ్బంది నుండి వినతులను స్వయంగా స్వీకరించిన ఎస్పీ గారు, వారి సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకున్నారు. బదిలీలు, సెలవులు, ఆరోగ్య సమస్యలు మరియు ఇతర సర్వీస్ సంబంధిత అంశాలపై సిబ్బంది విన్నవించుకున్నారు.వచ్చిన వినతులపై సత్వరమే స్పందించి,వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ ప్రధాన కార్యాలయ అధికారులకు ఎస్పీ గారు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని, వారి సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎస్పీ గారు భరోసా ఇచ్చారు.జిల్లా ఎస్పీ గారు స్వయంగా తమ సమస్యలను వినడం పట్ల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ అధికారులు, వివిధ విభాగాల పర్యవేక్షకులు మరియు పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు.

Breaking News

Subscribe our Newsletter