జాతీయ టైక్వాండో పోటీల్లో ఎలమంచిలి క్రీడాకారుడికి కాంస్య పతకం

జాతీయ టైక్వాండో పోటీల్లో ఎలమంచిలి క్రీడాకారుడికి కాంస్య పతకం

20/May/2026 20:05    Share:   

16వ జాతీయస్థాయి ఓపెన్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో ఎలమంచిలి క్రీడాకారుడు కాంస్య పథకం సాధించినట్లు టైక్వాండో కోచ్ నాగిరెడ్డి సత్యనారాయణ బుధవారం తెలిపారు. ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ జిల్లా గద్వాలలో జరిగిన 16వ జాతీయ ఓపెన్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో సత్య స్పోర్ట్స్ అకాడమీ సీనియర్ క్రీడాకారుడు కుండల రవి 58 కిలోల సీనియర్ ఫైటింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు. విజేతను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
Breaking News

Subscribe our Newsletter