జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించిన జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్

జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించిన జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్

11/April/2026 07:16    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు:
ఏలూరు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా బాటసారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, వారికి తాగునీరు మరియు చల్లదనం అందించేందుకు జిల్లా పరిషత్ కార్యాలయం మెయిన్ గేటు వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్  గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ గారు మాట్లాడుతూ, ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. బాటసారులకు తాగునీరు, శీతల పానీయాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వాహణాధికారి కె.భీమేశ్వర్ , జిల్లా పరిషత్ పరిపాలనాధికారులు, కార్యాలయ సిబ్బంది,  డివిజన్ కార్పొరేటర్ కె. సాంబ గారు, బి.సి నాయకులు లక్కోజు గోపి గారు,  TDP యూత్ లీడర్  ఇండ్ల.అశోక్ రాజ్   గారు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా వేసవి తాపాన్ని తగ్గించడంలో భాగంగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో జిల్లా పరిషత్ ముందడుగు వేసినట్లు అధికారులు తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter