భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికై భవన నిర్మాణ కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము, మండల కన్వీనర్ కే సోమనాయుడు సమావేశాల్లో పాల్గొని మాట్లాడుతూ, సిమెంట్ బస్తాకి 50, ఇనుము టన్ను కి 10000 రూపాయలు పెరిగాయి దీంతో పనులు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు వెంటనే పెంచిన నిర్మాణ సామాగ్రి ధరలు తగ్గించాలని, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి బోర్డు నుండి అమలు కావలసిన ప్రమాద బీమా 5 లక్షలు, కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్ లు రద్దుకు వ్యతిరేకంగా ఈనెల 7 అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద జరుగు ధర్నా జరుగుతుందని ,కార్మికులు పోరాడి 1996 భవన నిర్మాణ సంక్షేమ నిధి చట్టాన్ని సాధించుకున్నారు. ఈ చట్టం ప్రకారం నిర్మాణదారుల నుండి ఒక శాతం కార్మిక సంక్షేమ నిధి చేస్తున్న వసూలు చేసి, 32 రకాల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రమాద బీమా, ప్రసూతి, కార్మికులు పిల్లలకి స్కాలర్షిప్లు, పనిముట్లు గృహ నిర్మాణాలకు రుణ సౌకర్యాలు కల్పించడం దేని ప్రధాన ఉద్దేశం. నేడు కేంద్ర ప్రభుత్వం బిజెపి భవనిర్మాణ కాంక్షేమనిది చట్టాన్ని రద్దుచేసి కార్మికులకు అన్యాయం చేస్తుంది. ఈ చట్టం రద్దుకు రాష్ట్రంలో టిడిపి, వైసిపి ఎంపీలు పార్లమెంట్లో మద్దతు ఇచ్చారన్నారు. కావున ఈ చట్టం పునరుద్ధరణకు, గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాల అమలుకు జరుగుతున్న ఈ ధర్నాను కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు రాజన అప్పలనాయుడు, రమేష్, పలపాల రాజు ,నాయుడు తదితరులు పాల్గొన్నారు.