ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు పూర్తి ఉచిత విద్యుత్తు యోజన పథకాన్ని సద్వినియోగ పరుచుకోవాలి. 

ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు పూర్తి ఉచిత విద్యుత్తు యోజన పథకాన్ని సద్వినియోగ పరుచుకోవాలి. 

13/April/2026 07:11    Share:   

సోలార్ ప్యానెల్   ప్రతి ఇంటికి ఏర్పాటు చేసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి.
# కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు: 
సోలార్ విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ద్వారా గృహాలకు అవసరమైన విద్యుత్తును మనమే ఉత్పత్తి చేసుకోవచ్చును.
ప్రతి ఇంటికి సోలార్ ప్యానల్ ఏర్పాట్లు చేసుకునేలా విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలి.
రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ... 
# నూజివీడు మండలం బత్తులవారిగూడెం గ్రామంలో ఆదివారం ప్ర‌ధాన‌మంత్రి సూర్యఘర్ యుయల్ ఏ మోడ్ - ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సూర్య ఫలకాల గ్రిడ్ అనుసంధాన కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా మాజీ సర్పంచి డి.వెంకటరత్నం (ఎస్సీ) ఇంటికి ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు పూర్తి ఉచిత విద్యుత్తు యోజన పథకం ద్వారా సోలార్ ప్యానెల్ ను మంత్రి కొలుసు పార్థసారథి లాంఛనంగా ప్రారంభించారు. సూర్యాంద్ర ప్రగతి రథాన్ని మంత్రి జెండా ఊపి ప్రారంభించి, బ్రోచర్లను ఆవిష్కరించారు. 
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ పియం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పధకం ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి సోలార్ ఏర్పాటు చేసుకుని వినియోగించుకునేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టిందని అన్నారు. బొగ్గు ,పెట్రోల్, డీజిల్, భూమిలో నుంచి వచ్చే ఇతర పదార్థాలు వాడకాన్ని తగ్గించి, సౌర శక్తిని వినియోగించుకునేందుకు ప్రపంచ దేశాలు పోటీలు పడుతున్నాయని అన్నారు. మన భారతదేశం మొదటి వరుసలో ఉండగా, రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ మొదటి వరుసలో ఉందని అన్నారు. ప్రజలకు సోలార్ ప్యానల్ ఏర్పాటుపై అవగాహన కల్పిస్తే పెద్ద ఎత్తున  ప్రజలు ముందుకు వచ్చి సోలార్ విద్యుత్తును ఏర్పాటుకు సంసిద్ధంగా ఉన్నారని, ఇందుకు అధికారులు, బ్యాంకర్స్ కలిసికట్టుగా పనిచేసి మంచి ఫలితాలను సాధించాలని అన్నారు. ఈ  పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంలో కొంత వెనుకబడి ఉన్నామని, ఆర్థికంగా బలంగా ఉన్న ఈ జిల్లాలో ప్రజలకు అవగాహన కల్పిస్తే  మంచి ఫలితాలను సాధించవచ్చునన్నారు. ప్రతి సచివాలయంలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించి, ప్రతి ఇంటికి ఒక అవగాహన కరపత్రం అందాలని, నూటికి నూరుశాతం సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చెయ్యాలని, మంచి సబ్సిడీ కల పథకమని మనకు ఎంతో లాభం కలుగుతుంది అన్నారు. పియం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ అమర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఈ పథకం ద్వారా ఉచిత కరెంటు అందించుటకు శ్రీకారం చుట్టామని, దీనికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సోలార్ ప్లాంట్లు ధరఖాస్తులు బ్యాంకులో పెండింగు లేకుండా రుణాలను మంజూరు చేయాలని అప్పుడే ఈ పథకానికి మంచి ప్రగతి కనపడుతుంది అన్నారు. పీఎం కుసుమ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు అవగాహన కల్పించి ఈ పథకాన్ని ప్రతి రైతుకు అందించాలని అన్నారు. 
ఈ కార్యక్రమంలో ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టరు టి.వి.యన్. యస్.మూర్తి, యస్ఇ యు. హనుమయ్య, వివిధ శాఖలు అధికారులు, విద్యుత్తు శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, మండల ప్రముఖులు, కూటమి నాయకులు, ప్రజలు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున  పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter