ఇంటర్నెట్ లేకపోయినా NFC ద్వారా UPI లావాదేవీలు త్వరలో

ఇంటర్నెట్ లేకపోయినా NFC ద్వారా UPI లావాదేవీలు త్వరలో

21/July/2026 21:35    Share:   

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వినియోగదారుల కోసం కొత్త సౌకర్యాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. త్వరలో UPIలో NFC ఆధారిత ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫీచర్ ప్రవేశపెట్టబడనుంది.

  • వినియోగదారులు ముందుగా UPI Lite వాలెట్‌లో డబ్బు లోడ్ చేసుకోవాలి.

  • ఆ తర్వాత NFC సపోర్ట్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను PoS టెర్మినల్‌పై ట్యాప్ చేయడం ద్వారా చెల్లింపు పూర్తవుతుంది.

  • ఈ లావాదేవీలకు UPI PIN అవసరం ఉండదు.

  • ఆఫ్‌లైన్ లావాదేవీలు గరిష్టంగా ₹2,000 వరకు మాత్రమే చేయగలరు.

ప్రస్తుతం కూడా ఆఫ్‌లైన్ UPI సౌకర్యాలు ఉన్నాయి.

  • *99# సేవ – USSD టెక్నాలజీ ద్వారా కోడ్ డయల్ చేసి, PIN ఎంటర్ చేసి లావాదేవీ చేయవచ్చు.

  • UPI 123Pay – ఫీచర్ ఫోన్ వినియోగదారులకు IVR సిస్టమ్ ద్వారా చెల్లింపులు చేసే అవకాశం ఉంది.

అయితే, ఈ రెండు సేవలు మొబైల్ నెట్‌వర్క్‌పై ఆధారపడతాయి. కానీ కొత్త NFC ఫీచర్ ఇంటర్నెట్ లేకపోయినా పనిచేయగలదు.

Breaking News

Subscribe our Newsletter