శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు జడ్జి
22/October/2026 20:09
Share:
అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా ప్రసిద్ధిగాంచిన అనకాపల్లి గవరపాలెంలోని శ్రీ నూకాంబిక అమ్మవారిని గురువారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జి. ప్రవీణ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న న్యాయమూర్తికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.అనంతరం దేవస్థానం తరఫున న్యాయమూర్తిని ఘనంగా సత్కరించి, అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు), ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ లక్ష్మీ నగేష్, జిల్లా సహాయ కమిషనర్ వై.వి. రమణి, ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్, దాడి రవికుమార్, పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకర్రావు, కాండ్రేగుల రాజారావు, మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి పైడిరాజు, యర్రవరపు సంతోషి కుమారినాగేష్ తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్ ఎనాలసిస్ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ శ్రీనివాసరావు అప్పికొండ