వైభవంగా ముగిసిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర: పాల్గొన్న ఎమ్మెల్యేలు విజయ్ కుమార్, బండారి సత్యనారాయణ మూర్తి

వైభవంగా ముగిసిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర: పాల్గొన్న ఎమ్మెల్యేలు విజయ్ కుమార్, బండారి సత్యనారాయణ మూర్తి

18/April/2026 07:02    Share:   

అనకాపల్లి:
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, గవరపాలెంలో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో నెలరోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన కొత్త అమావాస్య రాష్ట్ర పండగ మహోత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ముగింపు వేడుకలు భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించబడ్డాయి.ఈ నెల పండుగ ముగింపు కార్యక్రమంలో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, మాడుగుల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి సత్యనారాయణ మూర్తి గారు ప్రత్యేకంగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం పరిసరాల్లో జరిగిన ఈ ముగింపు వేడుకల్లో భారీ సంఖ్యలో భక్తులు, గ్రామ ప్రజలు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జాతర ముగింపును పురస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Breaking News

Subscribe our Newsletter