ఎలమంచిలి:
ఎలమంచిలి పట్టణంలో అదృశ్యమైన ఇద్దరు బాలుర ఆచూకీని స్థానిక పోలీసులు చాకచక్యంగా కేవలం 12 గంటల వ్యవధిలోనే కనుగొన్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఎలమంచిలి పాత వీధికి చెందిన ఇద్దరు అబ్బాయిలు నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. దీనిపై బాలుర కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం 10 గంటలకు టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ గారు తీవ్రంగా స్పందిస్తూ, బాలురను త్వరితగతిన కనిపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీసులు వెంటనే నాలుగు ప్రత్యేక బృందాలను (టీమ్స్) ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
సాంకేతికతతో లభించిన ఆచూకీ
సిఐ గారి పర్యవేక్షణలో ట్రాఫిక్ ఎస్సై రామకృష్ణ,టౌన్ ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది ఈ గాలింపు చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని (టెక్నాలజీ) ఉపయోగించి, ఫిర్యాదు అందిన 12 గంటల లోపే ఇద్దరు బాలుర ఆచూకీని విజయవంతంగా ట్రేస్ చేశారు.