జి.వి.ఎమ్.సి.వేల్పుల వీధి ప్రాథమిక పాఠశాల లో పద్మశ్రీ ఘంటసాల 52 వ వర్ధంతి ..

జి.వి.ఎమ్.సి.వేల్పుల వీధి ప్రాథమిక పాఠశాల లో పద్మశ్రీ ఘంటసాల 52 వ వర్ధంతి ..

11/February/2026 19:48    Share:   

జి.వి.ఎమ్.సి.వేల్పుల వీధి ప్రాథమిక పాఠశాల లో పద్మశ్రీ ఘంటసాల 52 వ వర్ధంతి ..
విద్యార్థులకు పాటలపోటీలు, విజేతలకు ముఖ్య అతిధి మహిళా ఎస్సై శ్రీమతి పి.రాములమ్మ గారి చేతుల మీదుగా బహుమతీ ప్రదానం.
పద్మశ్రీ ఘంటసాల 52 వ వర్ధంతి పుర్స్కరిచుకొని స్థానిక సిద్దార్ధ సోషల్ సర్వీస్& కల్చరల్ అసోసియేషన్, అధ్యక్షులు బల్లానాగభూషణము ఆధ్వర్యములో పట్టణం లో గల వేల్పులవీధి జి.వి.ఎమ్ సి.ప్రాథమిక పాఠశాలలో అమరగాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 52 వ వర్థంతి ని ఘనం గా నిర్వహించారు.
ముందుగా శ్రీ ఘంటసాల గారి చిత్రపటాని కి ముఖ్య అతిధి మహిళా ఎస్సై ( వన్ స్టాఫ్ సెంటర్ పోలీస్ స్టేషన్) శ్రీమతి పి.రాములమ్మ గారు పూల మాల వేసి ఘనముగా నివాళి లర్పించారు.అనంతరం పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పాటలపోటీలలో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిధి
శ్రీమతి పి. ములమ్మగారు ఘంటసాల మెడల్స్, ప్రశంసా పత్రములను , గిఫ్టులను బహుమతులుగా అందజేశారు.
ఈ సందర్భముగా శ్రీమతి పి.రాములమ్మ గారు మాట్లాడుతూ శ్రీ ఘంట సాల గారు తెలుగు సినీ గాయకునిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, తెలుగు చలనచిత్ర రంగానికి విశేష సేవలను అందించి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గొప్ప గాయకులని అలాగే తెలుగు చలన చిత్ర చరిత్రలో 
అజరామగాయకునిగా, గాన గంధర్వడుగా, తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారని అన్నారు.నిర్వాహక సిద్దార్ధ సంస్థ అధ్య క్షులు బల్లానాగభూషణము మాట్లాడుతూ శ్రీ ఘంటసాల గారు తెలుగు సినీ గాయకుని గా సుమారు 10 వేల పాటలు, పద్యాలు, శ్లోకాలు, గేయాలు, భగవద్గీత, పుష్ప విలాపం, కుంతీ విలాపం, తన గానం ద్వారా అందించిన అలనాటి మేటి గాయకులని, స్వాతంత్ర్య పోరాటం లో కూడా పాల్గొని 18 నెలలు జైలు శిక్ష ను కూడా అనుభవించిన స్వాతంత్య్ర సమరయోధుడని అటువంటి మహనీయునికి ప్రభుత్వం గుర్తించి భారతరత్న అవార్డు ను ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేస్తున్నామని తెలియజేసారు.అందరికీ బిస్కట్స్ ప్యాకెట్లను అందజేశారు.
ఈ కార్యక్రమములో  పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి.రామాంజనేయులు, 
పాఠశాల ఉపాధ్యాయులు, సిద్దార్ధ అసోసియేషన్ అధ్యక్షులు బల్లానాగభూషణము, కార్యదర్శి వినకోట నీలేష్ గుప్తా, సహాయకార్యదర్శి రొబ్బి మల్లేశ్వరరావు,కార్య వర్గ సభ్యులు అయ్యగారు 
వెంకట రమణమూర్తి, బొడ్డు సోమరాజు, నందేల అప్పారావు, జి.ఎస్. కె.సాయిబాబా, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. 

పాటలపోటీలవిజేతలు..
ఎస్.చార్వీక్ , 5 వ తరగతి  ( మొదటి బహుమతి ) 
బి.శ్యామ్, 5 వ తరగతి..( ద్వితీయ బహుమతి ) 
ఎమ్.కుషిత, 4 వ తరగతి ( తృతీయ బహుమతి ) 
ప్రత్యేక బహుమతులు..జి.మృదుల , 4 వ తరగతి. డి.జయశ్రీ, 5 వ తరగతి.
Breaking News

Subscribe our Newsletter