ఆక్రమణల తొలగింపు అనకాపల్లి జోన్ పరిధిలో

ఆక్రమణల తొలగింపు అనకాపల్లి జోన్ పరిధిలో 'ఆపరేషన్ లంగ్స్ 3.0'

26/February/2026 18:18    Share:   

సెల్లార్ ఫ్లోర్లలో కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు కార్యక్రమంమహా విశాఖపట్నం నగరపాలక సంఘం అనకాపల్లి జోన్ పరిధిలో 'ఆపరేషన్ లంగ్స్ 3.0' కార్యక్రమంలో భాగంగా, వాణిజ్య-వ్యాపార స్థాపనల్లో సెల్లార్/స్టిల్ట్ ఫ్లోర్లను ఆక్రమించుకుని వ్యాపారాలు నడుపుతున్న రెండు ఆక్రమణలను గురువారం తొలగించామని అనకాపల్లి జోన్ టౌన్ ప్లానింగ్ అధికారి ఓ. వరప్రసాద్ రావు తెలిపారు.సెల్లార్ ఫ్లోర్లను ఆక్రమించుకున్న వ్యాపారస్థులు స్వచ్ఛందంగా వెంటనే తొలగించుకోవాలని ఆయన పత్రికా ప్రకటన ద్వారా హెచ్చరించారు. అనకాపల్లి పట్టణ పరిధిలో ప్రజలు, వాహనదారులు రోడ్లు, ఫుట్‌పాత్‌లు, బహిరంగ ప్రదేశాల్లో వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీనివల్ల రోడ్లు ఇరుకుపడి, ట్రాఫిక్‌కు అడ్డంకి పడుతూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి జోన్ టౌన్ ప్లానింగ్ అధికారి, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పి.అప్పల సూరి గారు,  ప్రణాళిక విభాగం సిబ్బంది, స్వర్ణ సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter