నెలవారీగా నిర్దేశించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీకి చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి,రాష్ట్ర భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ జి.జయలక్ష్మికి తెలిపారు.రాష్ట్ర సచివాలయం నుండి రీసర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, 22ఏ భూ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై మంగళవారం సిసిఎల్ఏ జయలక్ష్మి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సందర్భంగా సిసిఎల్ఏ జయలక్ష్మి మాట్లాడుతూ పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి సంబంధించి మే నెలలో నిర్దేశించిన మేర పంపిణీ చేయాలనీ,జూన్,నెలలో పంపిణీ చేయవలసిన పట్టాదార్ పాస్ పుస్తకాలకు సంబంధించి రైతుల వివరాలు, విస్తీర్ణం, తదితర అంశాలపై సమాచారం సిద్ధం చేసుకుని, పట్టాదార్ పాస్ పుస్తకాల ప్రచురణకు ముందు వివరాలను సరిచూసుకోవాలన్నారు. 22ఏ భూ సమస్యల పరిష్కారంలో నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూములకు సంబంధించి ఉన్న మార్గదర్శకాలను, కాలానుగుణంగా జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో మే నెలలో 13 గ్రామాల్లో 7701 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసి నూరుశాతం లక్ష్యాలు సాధించామన్నారు.22 ఏ భూ సమస్యలకు సంబంధించి 331 దరఖాస్తులు అందాయని వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.పిజిఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ లలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి ధరఖాస్తుదారులతో వారి సమస్యలను రెవిన్యూ అధికారులు స్వయంగా అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు.