కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు, నగరంలో వినియోగదారులకు సరిపడినంత ఇంధన నిల్వలు ఉన్నాయని, ప్రజలెవ్వరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. సోమవారం ఏలూరు తూర్పువీధిలోని ఒక పెట్రోల్ బంకును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో వాహనాదారులకు కాకుండా బాటిళ్ళలో పెట్రోల్ నింపుతోన్న దృశ్యాలను గమనించిన ఎమ్మెల్యే చంటి,,, దాన్ని ఖండించారు. తొలుత క్యూలైన్‌లో ఉన్న వాహనాల్లోనే పెట్రోల్ కొట్టాలని బంకు నిర్వాహకులకు, సిబ్బందికి సూచించారు. తర్వాతే బాటిళ్ళలో నింపాలంటూ ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు బంకులోని కార్యాలయానికి వెళ్ళిన ఆయన,,, బంకులో ఆయిల్ నిల్వలు ఎంత ఉన్నాయంటూ నిర్వాహకులను ప్రశ్నించారు. వాహనదారులెవ్వర్నీ రహదారిపై నిలబెట్టొద్దని వారికి సూచించారు. ఒకానొక సమయంలో తానే స్వయంగా కార్యాలయం నుండి బయటకు వచ్చి క్యూలైన్‌లో ఉన్న వాహనాల్లో మాత్రమే పెట్రోల్ నింపేలా సిబ్బందిని ప్రోత్సహించారు. ఈ విధంగా పెట్రోల్ బంకు వద్ద వాహనదారులకు మద్దతుగా గొంతెత్తిన ఎమ్మెల్యే బడేటి చంటి చొరవను, ప్రత్యేక శ్రద్ధను ప్రజలు ప్రశంసిస్తున్నారు...