మహిళా పోలీసులకు ఆరోగ్య పరీక్షలు.  డీఎస్పీ శ్రావ ణి

మహిళా పోలీసులకు ఆరోగ్య పరీక్షలు. డీఎస్పీ శ్రావ ణి

03/March/2026 19:51    Share:   

International Women's Day కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు 03.03.2026 న ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు అనకాపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా సంరక్షణ కార్యదర్శులకు(GMSKs) మరియు అనకాపల్లి సబ్ డివిజన్ పరిధిలో గల వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న విమెన్ పోలీస్ సిబ్బందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడినవి.
అనకాపల్లి సబ్-డివిజన్ పరిధిలోని గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు (GMSKs) మరియు అనకాపల్లి సబ్ డివిజన్ పరిధిలో గల వివిధ పోలీస్ స్టేషన్లలో హోమ్ గార్డ్ ర్యాంక్ నుండి ఏఎస్‌ఐ ర్యాంక్ వరకు పని చేస్తున్న మహిళా పోలీస్ సిబ్బంది మొత్తం 60 మంది ఈ ఆరోగ్య శిబిరంలో పాల్గొన్నారు. వారికి సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించబడినవి.
ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మహిళా ఉద్యోగులను ఉద్దేశించి శ్రీమతి ఎం. శ్రావణి, DSP, అనకాపల్లి గారు మాట్లాడుతూ, తమ విధుల నిర్వహణలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
ఈ ఆరోగ్య శిబిరంలో డాక్టర్ శ్రీనివాస్ (D.C.H.S.), డాక్టర్ రవి కుమార్, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, డాక్టర్ మానస, గైనకాలజిస్ట్,డాక్టర్ అశ్విని, MBBS తదితర ప్రభుత్వ వైద్య అధికారుల పర్యవేక్షణలో జరిగింది. 
శ్రీమతి M.శ్రావణి,DSP,అనకాపల్లి,G.ప్రేమ కుమార్,ఇనస్పెక్టర్ఆఫ్ పోలీస్,అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్,M.వెంకట నారాయణ,ఇనస్పెక్టర్ఆఫ్ పోలీస్,అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్,A.వెంకటేశ్వరావు, ఎస్‌.ఐ.,అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ అధికారుల పర్యవేక్షణలో సమర్థవంతంగా నిర్వహించబడింది.
Breaking News

Subscribe our Newsletter