డైట్ కళాశాలలో ఘనంగా 59 వ  ఇంజనీర్స్ డే వేడుకలు

డైట్ కళాశాలలో ఘనంగా 59 వ  ఇంజనీర్స్ డే వేడుకలు

15/September/2026 18:52    Share:   

దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (డైట్) అటానమస్ కళాశాలలో 59 వ ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం డైట్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం మరియు డైట్ IE(I) స్టూడెంట్ చాప్టర్ , డైట్ IGBC స్టూడెంట్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్.ఎస్.టీ.ఎల్ అవుట్స్టాండింగ్ సైంటిస్ట్ మరియు అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ హెచ్ ఎన్ దాస్ గారు పాల్గొన్నారు.

డైట్ లో ప్రతిష్టించిన భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి విగ్రహానికి పూల మాలతో నివాళ్లు అర్పించారు. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లైవ్ ప్రాజెక్ట్ డెమోస్ట్రేషన్లో పాల్గొని విద్యార్థుల ప్రతిభను మెచ్చుకున్నారు. ఇన్నోవేషన్స్ మరియు రీసెర్చ్ కొరకు డైట్ కళాశాల అందిస్తున్న సౌకర్యాలను కొనియాడారు. తదనంతరం డైట్ కళాశాల ఏసీ సెమినార్ హాల్ నందు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ భార్గవి గారు మాట్లాడుతూ నేటి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఏ.ఐ వినియోగించడం పై ప్రోత్సహించి, ప్రాజెక్టులు చేయిస్తున్నాము అని తెలియజేసారు. ప్రతి ఇంజనీర్ తమ కార్యనిర్వహణ లో ఎన్నో అడ్డంకులు కష్టాలు ఎదురుకోవాల్సి వస్తుంది అని వాటిని ఎదురుకుంటూ ముందుకు సాగాలి అని  భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, భారత రత్న అబ్దుల్ కలాం గారు వంటి మహోన్నత ఇంజినీర్ల జీవిత ఉదాహరణలు తెలియజేసారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ వైకుంఠరావు గారు మాట్లాడుతూ విద్యార్థులు ఆధునిక నైపుణ్యతను పెంపొందించుకోవాలని, ఇందుకు విశ్వేశ్వరయ్య గారిని ప్రేరణ తీసుకోవాలని సూచించారు. ఆధునీకరణ చెందుతున్న ప్రపంచం లో పరిష్కారం అందించేవాడే ఇంజనీర్ అని వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎన్.ఎస్.టీ.ఎల్ అవుట్స్టాండింగ్ సైంటిస్ట్ మరియు అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ హెచ్ ఎన్ దాస్ గారు ప్రసంగిస్తూ విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించడం అవసరం అని తెలియజేసారు. ఇంజనీర్ అనే పదం కేవలం ఒక విభాగానికి పరిమితం కాదు అని ప్రపంచం అంతా ఒకే భువనైక కుటుంబం గా ఉండటానికి అందరి పరస్పర సహకారం మరియు  జ్ఞాన బదిలీ జరుగుతూ ఉండాలని పేర్కొన్నారు . మన సామజిక జీవన శైలి లో మనం వాడే ప్రతి వస్తువుకు ఒక ప్రమాణం ఉంటుంది అని దానిని భవిష్యత్తు లో కాబోయే ప్రతి ఇంజనీర్ తెలుసుకోవాలని అభిలాషించారు. 
ఈ సందర్భంగా ఇంజనీర్స్ డేని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ సాంకేతిక పోటీలకు విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మెమెంటో, కాష్ ప్రైజ్ మరియు సర్టిఫికెట్ బహూకరించారు. బెస్ట్ లైబ్రరీ యూసర్ అవార్డులను కూడా ఈ సందర్భంగా విద్యార్థులకు బహూకరించారు.ఈ కార్యక్రమంలో  డైట్ ఐ.ఈ.ఐ కన్వీనర్ వై హేమంత్ కుమార్ మరియు వివిధ ఇంజనీరింగ్ విభాగ అధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter