యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్‌రే యూనిట్ ప్రారంభోత్సవం
14/March/2026 19:15
Share:
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్ యలమంచిలి : అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ కేంద్రంలోని యలమంచిలి మున్సిపాలిటీలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఎక్స్‌రే యూనిట్‌ను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలుకల్పిస్తున్నామని తెలిపారు. యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి పరిసర గ్రామాల ప్రజలతో పాటు జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాల్లో గాయపడిన వారు కూడా చికిత్స కోసం వస్తుంటారని, ఈ నేపథ్యంలో ఎక్స్‌రే యూనిట్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జన సేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, ఎక్స్‌రే యూనిట్ టెక్నీషియన్, ఆసుపత్రి సిబ్బంది, కూటమి నాయకులు బొద్ధపు శ్రీను, తట్టా లవ కుమారి, కోటారి శ్రీను మాస్టర్, ఊటకూటి రమేష్ నాయుడు, కొటారి నరేష్, లంక ఉదయ్, గుర్రాల శేఖర్, టివియస్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.