పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గిచాలి సిపిఎం..

పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గిచాలి సిపిఎం..

08/June/2026 17:56    Share:   

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు( డబల్ ఇంజన్ సర్కార్ ) ఈ రోజు పెంచిన గ్యాస్ రూ.29/- లు అలాగే పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే రద్దు చేయాలని, మన రాష్ట్రంలోని కృష్ణ గోదావరి నదులలో లభ్యమవుతున్న గ్యాస్ లో మన రాష్ట్రానికి 50% వాటా ఇవ్వాలని కోరుతూ ఈరోజు అచ్చుతాపురం నాలుగు రోడ్లు జంక్షన్ లో సిపిఎం అచ్చుతాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో గ్యాస్ బండను మోస్తూ నిరసన తెలిపారు. 
ఈ సందర్భంగా సిపిఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్ రాము సీనియర్ నాయకులు కె రామ సదాశివరావు కర్రీ అప్పారావు లు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం మూలిగే నక్క పై తాటికాయ పడ్డ చందంగా సామాన్య ప్రజలపై గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గం అన్నారు. అంతర్జాతీయంగా ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధాన్ని సాకుగా చూపి చమురు ధరలను విపరీతంగా పెంచిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ పై ఎనిమిది రూపాయలు భారం వేసింది అన్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై సుమారు 1300 రూపాయలు బారాలు మోపింది అన్నారు. తాజాగా ఎల్పీజీ గ్యాస్ రూ.29/- లు పెంచి ప్రజల నడ్డి విరిచారు. మరోపక్క విమానాలు వినియోగించే ఇంధనంపై ధరలు తగ్గించారన్నారు. సుమారు పదివేల కోట్ల రూపాయలు మోడీ ప్రభుత్వం విమానయాన సంస్థలకు చమురు ధరలపై సబ్సిడీ ఇచ్చిందన్నారు. మోడీ గారు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే GDP పెంచుతామని ప్రకటించారు. జిడిపి అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ అని అప్పుడు అర్థం కాలేదన్నారు. పొదుపు చర్యలు చేపట్టండి విదేశీ ప్రయాణాలు మానేయండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వాడండి అని చెబుతున్న మోడీ, చంద్రబాబులు విదేశీ పర్యటనలో చార్టెడ్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు వాడుతున్నారన్నారు. బయటికి మాత్రం సైకిల్ తొక్కుతూ ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారన్నారు.
 ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలు కనీస వేతనాలు అమలు చేయకపోవడం వలన పెరిగిన నిత్యవసర వస్తువులు ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో సతమతమవుతూ ఒక పూట తిని మరో పూట తినకుండా పస్తులు వుంటున్నారన్నారు. 
 మరోపక్క మన ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులలో లభ్యమవుతున్న గ్యాస్ నిక్షేపాలను రిలయన్స్ కంపెనీ గుజరాత్, మహారాష్ట్రలకు తరలించుకు పోతుందన్నారు. మన రాష్ట్రంలో లభ్యమయ్యాయి గ్యాస్ లో 50% మన రాష్ట్ర అవసరాలకే వినియోగించాలన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగితే ప్రజల వినియోగించే ఆహార ధాన్యాలు నిత్యవసర వస్తువులు తోపాటు అన్ని వస్తువుల ధరలు పెరిగి ప్రజల మీద మోయలేని భారం పడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కూండ్రపు సోము నాయుడు, ఆర్ లక్ష్మి, ఎ రమణ ఎల్ శ్రీనివాసు ,కిల్లాడి పెంటారావు, గొర్లి దొరబాబు, ఒడిసెల పైడిరాజు, అల్లు రాజు, పెంటారావు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter