బాణాసంచా పేలుడు.. 21 మంది మృతి. సామర్లకోటలో విషాద ఘటన
01/March/2026 08:19
Share:
ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెం పరిధిలోని బాణాసంచా కేంద్రంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది అక్కడికక్కడే మృత్యువాతపడగా, 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 9 మంది పరిస్థితి విషయం ఉన్నది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం..వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కనే ఉన్న సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్‌లో శనివారం మధ్యాహ్నం 2గంటల సమయంలో టపాకులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడుతో ఐదు గ్రామాల పరిధిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. బాణాసంచా కేంద్రం పొలాల్లో ఉండటంతో అక్కడకు వెళ్లేందుకు అంబులెన్స్, ఫైరింజన్‌తోపాటు వాహనాలు కూడా వెళ్లడానికి కష్టంగా మారింది. దీంతో సుమారు రెండుగంటలపాటు పేలుళ్లు జరగడంతో స్థానికులు అక్కడకు చేరుకునేలోపే అందులో చిక్కుకున్న వారు అగ్నికి ఆహుతయ్యారు.