మహిళా బిల్లును అడ్డుకోవడం దారుణం.. కాంగ్రెస్‌పై కూటమి మహిళా నేతల ఫైర్!
21/April/2026 08:26
Share:
అనకాపల్లి: పార్లమెంట్‌లో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం మహిళా లోకానికి తీరని అన్యాయం చేయడమేనని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నాగమణి తీవ్రంగా విమర్శించారు. సోమవారం అనకాపల్లిలోని ఎంపీ సీఎం రమేష్ కార్యాలయంలో కూటమి మహిళా నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహించాల్సింది పోయి, వారి ప్రాధాన్యతను తగ్గించేలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించడం శోచనీయమన్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు ఎన్నో ఏళ్లుగా ఈ బిల్లు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని గుర్తుచేశారు. రాజ్యాంగం ప్రకారం మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొణతాల రత్నకుమారి, టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంజు, ఉపాధ్యక్షురాలు పైలా అమ్మాజీ, జనసేన వీర మహిళ రెడ్డి ధనలక్ష్మి, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు అనురాధ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ రావు . ఎ క్రైమ్ ఎనాలసిస్ , జిల్లా ఇంచార్జ్,అనకాపల్లి.