రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విజయ్ కుటుంబానికి జనసేన అండ..
02/April/2026 09:05
Share:
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఏలూరు తూర్పు వీధికి చెందిన కనకం విజయ్ గారి కుటుంబానికి జనసేన అండ..
రూ.5 లక్షల భీమా చెక్కును కుటుంబ సభ్యులకు అందజేత..
మంగళగిరి కార్యాలయంలో చెక్కును అందజేసిన ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు.. కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు, ఏప్రిల్ 01 ఏలూరు నియోజకవర్గం తూర్పు వీధికి చెందిన నిస్వార్థ క్రియాశీలక కార్యకర్త కనకం విజయ్ గారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలిచింది. రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కనకం విజయ్ గారి కుటుంబానికి జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయంతో ఏర్పాటు చేసిన ప్రమాద భీమా ద్వారా రూ.5లక్షల ఇన్సూరెన్స్ చెక్కును గురువారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అందజేశారు. ఈ చెక్కును రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారి చేతులమీదుగా వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా పిడుగు హరి ప్రసాద్ గారు మాట్లాడుతూ కనకం విజయ గారు పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకుని వారి కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన హామీని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, క్రియాశీలక వాలంటీర్ జి.కిషోర్, కనకం విజయ్ గారి కుటుంబ సభ్యులు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..