ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి బిడ్డకూ అందాలి: ఏపీ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యులు గాంధీబాబు"

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి బిడ్డకూ అందాలి: ఏపీ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యులు గాంధీబాబు"

28/April/2026 06:52    Share:   

బాలలు హక్కులు సంరక్షణ, వారి వికాసం కొరకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికి అందేలా చూడాలి.
ఏపి చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యులు శ్రీ గాంధీబాబు ...
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,
ఏలూరు,
స్థానిక జిల్లా శనివారం పేట నందు సోమవారం జువెనైల్ వెల్ఫేరు డిపార్ట్మెంటు ద్వారా నిర్వహించబడుతున్న బాయ్స్ హోమ్ , అబ్జర్వేషన్ హోమ్  లను సందర్శించి అక్కడ  పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలను, వారి రోజువారి నివేదికలను, వారి అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సేవలు అన్ని వారికి సక్రమంగా అందుతున్నాయా లేదా అన్నది ఏపి చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యులు శ్రీ గాంధీబాబు పర్యవేక్షించడం జరిగింది. తదుపరి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి కార్యాలయం సందర్శించి అక్కడకి వస్తున్న ఆదరణ సంరక్షణ అవసరమైన బాలలు పట్ల వారు ఆచరిస్తున్న  స్నేహపూర్వక విధానాల గురించి, వారి ముందు ప్రొడ్యూస్ చేయబడిన కేసులు యొక్క వివరాలు గురించి మరియు బాలల సంరక్షణ కోసం వారు తీసుకుంటున్న నిర్ణయాలు గురించి తదితర అంశాలను విపులంగా చర్చించడం జరిగినది. అదేవిధంగా స్థానిక విద్యానగరు నందు ఉన్న మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా నిర్వహించ బడుతున్న శిశుగృహ హోంను సందర్శించడం జరిగినది. అక్కడ ప్రస్తుతము ఆశ్రయం పొందుతున్న ఎనిమిది మంది బాలలు యొక్క వ్యక్తిగత కేసు స్టడీలను పరిశీలించి వాటిపైన తదుపరి సిడబ్ల్యుసి వారు తీసుకునే నిర్ణయాలు పైన ఆరోగ్యపరంగా తీసుకోబోవు చర్యలు గురించి వివరంగా సమీక్షించడం జరిగినది.  ఏపి చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యులు శ్రీ గాంధీబాబు కొన్ని సూచనలను జారీ చేశారు.ఈ కార్యక్రమంలో  జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి శ్రీమతి పి.శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి డా. సి.హెచ్. సూర్యచక్రవేణి, చైల్డ్ వెల్ఫేరు కమిటీ సభ్యులు పి.వెంకటేశ్వర రావు , కె.హైమావతి, రాజేశ్వరరావు, జువెనైల్ వెల్ఫేర్ హోమ్ సూపర్డెంటు శ్రీవల్లి, జిల్లా ప్రొబేషనరీ ఆఫీసరు కుమారి జ్యోతి, శిశుగృహ మేనేజరు కె.భార్గవి,తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter