కోతుల దాడిలో వృద్ధురాలికి తీవ్ర గాయం: రంగావారి వీధిలో భయాందోళన

కోతుల దాడిలో వృద్ధురాలికి తీవ్ర గాయం: రంగావారి వీధిలో భయాందోళన

05/April/2026 06:29    Share:   

యలమంచిలి కొత్తపేట:
స్థానిక రంగావారి వీధిలో కోతుల గుంపు ఒక్కసారిగా హల్ చల్ చేశాయి. ఆదివారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో కొండపల్లి రంగయమ్మ (70) అనే వృద్ధురాలు తన ఇంట్లో పని చేసుకుంటుండగా, ఆరుబయట ఒక్కసారిగా కోతుల గుంపు ఆమెపై దాడికి దిగింది.ఈ అనుకోని దాడిలో రంగయమ్మ చేతికి తీవ్ర గాయమైంది. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో కోతులు పారిపోయాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జనవాసాల్లోకి కోతులు గుంపులుగా వచ్చి దాడులు చేస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కోతుల బెడద నుండి తమను రక్షించాలని కోరుతున్నారు
Breaking News

Subscribe our Newsletter