కాలుష్య నియంత్రణకు పెద్దపీట..ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB)

కాలుష్య నియంత్రణకు పెద్దపీట..ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB)

30/April/2026 08:06    Share:   

కాలుష్య నియంత్రణకు పెద్దపీట.. ఎస్‌జీఎస్ మైనర్స్ పనులపై కొనసాగుతున్న పీసీబీ పర్యవేక్షణ స్థానికులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు
అధికారుల సహకారంతో విజయవంతంగా కొనసాగుతున్న కార్యకలాపాలు
అనకాపల్లి మండలం మాటూరు గ్రామ పరిధిలో నిర్వహిస్తున్న ఎస్‌జీఎస్ మైనర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (శ్రీ రాజ ప్రాజెక్ట్) కార్యకలాపాలపై ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయం నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పనుల వల్ల స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంస్థ యాజమాన్యం అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో ధూళి, శబ్ద కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా:నిత్యం రోడ్లపై నీటి పిచికారీ చేయడం.కాలుష్యం వెలువడకుండా వాహనాల రాకపోకల నియంత్రణ.
పర్యవేక్షణ కోసం ప్రత్యేక భద్రతా సిబ్బంది నియామకం.వంటి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల మాటూరు గ్రామ ప్రజల రోజువారీ జీవనానికి ఎలాంటి అంతరాయం కలగకుండా యాజమాన్యం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
కార్మికుల భద్రతతో పాటు పరిసర ప్రాంతాల పర్యావరణ పరిరక్షణపై కూడా సంస్థ ప్రత్యేక దృష్టి సారించిందని ప్రతినిధులు తెలిపారు. ఎప్పటికప్పుడు గ్రామ ప్రజలతో సమన్వయం చేసుకుంటూ, స్థానికంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వారు స్పష్టం చేశారు.
కాలుష్య నియంత్రణ, భద్రతా పర్యవేక్షణకు సంబంధించిన ఈ కార్యక్రమం ఆర్డీఓ, వీఆర్వోలతో పాటు అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పూర్తి సహకారంతో జయప్రదంగా నిర్వహించినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
శ్రీనివాస్ ఎ క్రైమ్ ఎనాలసిస్ జిల్లా ఇంచార్జ్ అనకాపల్లి.
Breaking News

Subscribe our Newsletter