యలమంచిలి లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పోలీస్ వ్యవస్థపై అవగాహన కార్యక్రమం

యలమంచిలి లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పోలీస్ వ్యవస్థపై అవగాహన కార్యక్రమం

06/March/2026 20:28    Share:   

యలమంచిలి: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు పురస్కరించుకొని స్థానిక పోలీస్ స్టేషన్ లో బాలికలకు పోలీస్ వ్యవస్థపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్.ఐ కె. సావిత్రి విద్యార్థినులకు పోలీస్ స్టేషన్ పనితీరు, చట్టాలపై ఉన్న అవగాహన గురించి వివరించారు. పోలీస్ స్టేషన్ అనేది కేవలం నేరస్థులను శిక్షించే చోటు మాత్రమే కాదని, అది ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే భరోసా కేంద్రమని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌లో ఉండే వివిధ విభాగాలు, ఫిర్యాదు ఎలా చేయాలి (ఎఫ్ ఐ ఆర్), మహిళా హెల్ప్ డెస్క్ ప్రాధాన్యతను విద్యార్థినులకు ప్రాక్టికల్‌గా వివరించారు. ఆపద సమయంలో బాలికలు భయపడకుండా పోలీసుల సహాయం ఎలా పొందాలో వివరించారు. ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్స్ వంటి వాటి పట్ల చట్టాలపై అవగాహన ఉండాలని సూచించారు. బాలికలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, ఏదైనా సమస్య ఎదురైతే ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని కోరారు. విద్యార్థినులు అడిగిన పలు సందేహాలకు ఎస్.ఐ సావిత్రి సమాధానాలిచ్చారు. అనంతరం విద్యార్థినులు పోలీస్ స్టేషన్‌లోని లాకప్, ఆయుధాల గది, రికార్డ్ రూమ్‌లను సందర్శించారు. పిస్టల్ ను ఉపయోగిస్తారో ప్రాక్టీకల్ గా చూపించారు. ​ఈ కార్యక్రమంలో బాలికోన్నత పాఠశాల, సెయింట్ మేరీస్ స్కూల్ విద్యార్థినులు, పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter