మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లా రమాకుమారి దంపతులకు ఘన సత్కారం

మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లా రమాకుమారి దంపతులకు ఘన సత్కారం

10/November/2026 19:15    Share:   

​యలమంచిలి :
యలమంచిలి మున్సిపల్ చైర్ పర్సన్‌గా మూడోసారి ఎన్నికైన పిల్లా రమాకుమారి దంపతులను స్థానిక స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేద ఆశీర్వాదాలతో, శాలువా కప్పి, గజమాలతో ఘనంగా సత్కరించారు. ​స్థానిక పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సి.హెచ్. సోమేశ్వరరావు, కార్యదర్శి జి. సాంబమూర్తి, కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రమాకుమారి మరిన్నిున్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ఆమె ఎనలేని కృషి చేస్తూ, మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో ఆడారి పూరి జగన్నాథం, అబ్దుల్లా మాష్టారు, సిఐ నాగరాజు, షరీఫ్ తదితరులు పాల్గొని నూతన చైర్ పర్సన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter