కాలుష్య కోరల్లో చిక్కుకున్న దుప్పితూరు గ్రామాన్ని తరలించి, పోలీసు పికెట్ ఎత్తివేయాలి: సీపీఎం
03/May/2026 16:25
Share:
క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ - యలమంచిలి
అచ్చుతాపురం మండలం దుప్పితూరు గ్రామాన్ని సీపీఎం పార్టీ బృందం సందర్శించి గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుంది. ఇటీవల గ్రామంలో ప్రజలపై నిర్బంధ చర్యలు చేపట్టి అక్రమ అరెస్టులకు పాల్పడటం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమని సీపీఎం తీవ్రంగా ఖండించింది.ఈ సందర్భంగా సీపీఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు కర్రీ అప్పారావు మాట్లాడుతూ, గత 22 సంవత్సరాలుగా దుప్పితూరు గ్రామాన్ని తరలిస్తామని ప్రభుత్వాలు పలుమార్లు హామీలు ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు.కంపెనీలకు భూములు ఇచ్చిన నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకుండా, గ్రామం చుట్టూ గోడ నిర్మించి ప్రజలకు ఉపాధి అవకాశాలు లేకుండా చేయడం అన్యాయమన్నారు. ప్రమాదకర కంపెనీల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో గ్రామ ప్రజలు అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే పలువురు మృతి చెందినట్లు తెలిపారు.ప్రభుత్వం వెంటనే దుప్పితూరు గ్రామాన్ని తరలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని, గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీసు పికెట్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే గ్రామ ప్రజలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీపీఎం కన్వీనర్ రొంగలి రాము, మండల కమిటీ సభ్యులు కూండ్రపు సోమునాయుడు, రమణ తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.