ఏలూరు నగరపాలక సంస్థ డివిజన్ మేయర్‌గా కర్రి శ్రీనివాసరావు

ఏలూరు నగరపాలక సంస్థ డివిజన్ మేయర్‌గా కర్రి శ్రీనివాసరావు

26/February/2026 20:32    Share:   

ఏలూరు, ఫిబ్రవరి 26
ఏలూరు నగరపాలక సంస్థ డివిజన్ మేయర్‌గా 12వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో సమావేశ మండలిలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో డివిజన్ మేయర్ ఎన్నికను నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ మేయర్ పదవికి 12వ డివిజన్ కార్పొరేటర్ కత్తి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని మాజి డిప్యూటీ మేయర్, 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు ప్రతిపాదించగా,,, కార్పొరేషన్ విసి, 28వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల అరుణ బలపరిచారు. ఈక్రమంలో కర్రి శ్రీనివాసరావు డివిజన్ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రత్యేక అధికారి, ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ వి. విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. అనంతరం ఆయనకు ఎంఈఓ ఆఫీసులో మేయర్, ఏలూరు ఎంపీపీ బడేటి చంటి, అధికారికంగా ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా డివిజన్ మేయర్‌గా ఎన్నికైన కర్రి శ్రీనివాసరావుకు అభినందనలు వెల్లువెత్తాయి.
Breaking News

Subscribe our Newsletter