కొత్తూరులో ఇంటింటికీ ‘రక్షిత’ జలం: మంచినీటి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్.

కొత్తూరులో ఇంటింటికీ ‘రక్షిత’ జలం: మంచినీటి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్.

20/April/2026 21:06    Share:   

రాంబిల్లి (యలమంచిలి): మండలంలోని కొత్తూరు పంచాయతీ ప్రజల దశాబ్దాల దాహార్తి తీరింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన 'జల జీవన్ మిషన్' పథకంలో భాగంగా రూ. 50.60 లక్షల వ్యయంతో నిర్మించిన రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని, ఇంటింటి కుళాయిలను యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, జల జీవన్ మిషన్ ద్వారా మారుమూల గ్రామాలకు సైతం మంచినీటి సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో నీటి కోసం ఇబ్బందులు పడ్డ గ్రామస్తులు, ఇకపై తమ ఇంటి ముందే సురక్షితమైన నీటిని పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ గ్రామానికి మంచినీటి పథకాన్ని మంజూరు చేసి, ప్రారంభించినందుకు గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Breaking News

Subscribe our Newsletter