సింహాచలం దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు నియామకం.. 16 మందితో పాలక మండలి ఏర్పాటు!

సింహాచలం దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు నియామకం.. 16 మందితో పాలక మండలి ఏర్పాటు!

15/May/2026 09:16    Share:   

విశాఖపట్నం:
శ్రీనివాస్ ఏ క్రైమ్ ఎనాలిసిస్,జిల్లా ఇన్చార్జ్.అనకాపల్లి.
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన ట్రస్ట్ బోర్డును ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక బోర్డు ఛైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి, పూసపాటి అశోక్ గజపతిరాజును నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
16 మందితో నూతన పాలక మండలి:
కొత్తగా ఏర్పాటైన ఈ పాలక మండలిలో ఛైర్మన్‌తో పాటు మొత్తం 16 మందికి ట్రస్ట్ బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించారు. విజయనగరం, భీమిలి, పెందుర్తి, విశాఖపట్నం సహా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు చెందిన ప్రముఖులకు ఈ జాబితాలో చోటు దక్కింది. ముఖ్యంగా మక్కెన సీతారాం పాత్రుడు, కసిరెడ్డి దామోదర్, డాక్టర్ శ్రీధరణి బండ్ల తదితరులు ఈ నూతన బోర్డులో సభ్యులుగా నియమితులయ్యారు.
భక్త జనావళికి మెరుగైన సేవలే లక్ష్యం:
ఆలయ సమగ్ర అభివృద్ధి, దైనందిన కార్యక్రమాల నిర్వహణను ఈ నూతన బోర్డు పర్యవేక్షించనుంది. సింహాద్రి అప్పన్న దర్శనార్థం దేశవిదేశాల నుండి వచ్చే భక్తులకు మరింత మెరుగైన, నాణ్యమైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కొత్త పాలక మండలి బాధ్యతలు నిర్వర్తించనుంది.
Breaking News

Subscribe our Newsletter