ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం MLA బడేటి. .

ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం MLA బడేటి. .

14/March/2026 09:44    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు 
ఏలూరు, మార్చి 13..
ప్రజలెదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రజా అవసరాలను గుర్తించడంతో పాటూ నిరంతరం ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే అత్యధిక సమయం కేటాయిస్తూ వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా ప్రజాదర్బార్ నిర్వహిస్తూ  ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.    ఏలూరు పవర్‌ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరులోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజల నుండి ఎమ్మెల్యే బడేటి చంటి సమస్యలతో కూడిన వినతిపత్రాలను స్వీకరించారు. వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. నేనున్నానంటూ వారికి భరోసా కల్పించీ, అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాధినేతల లక్ష్యాలకు తగ్గట్టుగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఎక్కువ సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని ఆయన చెప్పారు. డ్వాక్రా సంఘాల మధ్య సమన్వయ లోపం ఉంటే గ్రూపు సభ్యులందరికీ నష్టం జరుగుతుందని,  ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టుకుని డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, ఎఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, డిప్యూటీ మేయర్ కర్రీ శ్రీనివాస్, ఏలూరు నగర టిడిపి అధ్యక్షులు చోడే వెంకటరత్నం,  కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు బెల్లపుకొండ కిషోర్‌, బిఎస్ఎన్ఎల్ జిల్లా డైరెక్టర్ లంకపల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు...
Breaking News

Subscribe our Newsletter