అయిదు ఎకరాల భూమికి సహకారం అందిస్తా.. శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు

అయిదు ఎకరాల భూమికి సహకారం అందిస్తా.. శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు

05/April/2026 20:51    Share:   

- ప్రకృతి ఆధారంగా పండించిన పంటలతోనె భవిష్యత్తు
- గంటా శ్రీనివాసరావు, భీమునిపట్నం, శాసనసభ్యులు 
శబల భోజనాలకు పూర్తి సహకారం అందిస్తాం అని భీమునిపట్నం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఉదయం సింహాచలం దేవస్థానానికి చెందిన గోశాల వద్ద సేవ్ సంస్థ విజయరామ్, సంకల్ప కళా గ్రామం వ్యవస్థాపకులు ఆకుల చలపతిరావు, తులసి నేచురల్స్ సత్యనారాయణ ల నేతృత్వంలో అయిదవ రోజు శబల భోజనాల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిరంతరం శబల భోజనాల నిర్వహణ కోసం విజయరామ్ అడిగిన అయిదు ఎకరాల భూమికి సహకారం అందిస్తా అని హామీ ఇచ్చారు. ప్రకృతి ఆధారంగా పండించిన పంటలతోనె భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది అన్నారు.పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ మాట్లాడుతూ ప్రకృతి ఆధారంగా పండించి పండించిన పంటలే తాను ఆహారం గా భుజించడం జరుగుతుంది అన్నారు. తాను పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మల్లిఖార్జునరావు జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమం ప్రారంభం చేసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు ప్లాస్టిక్, ప్లెక్సీలు లేకుండా నిర్వహించిన ఈ శబల భోజనాల పండుగ కన్నుల పండువగా ఉంది అన్నారు.భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ప్రకృతి ఆధారంగా జీవించే మనమంతా ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం కృషి అన్నారు. శబల భోజనాలకు జాతీయ స్థాయిలో ప్రచారం, కృషి అవసరం అని, తనవంతు సహకారం అందిస్తామని చెప్పారు.సిపిఐ జాతీయ నాయకులు జెవి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మన తినే ఆహారం ఆరోగ్యకరమైనది కావాలని కోరారు. ఇందుకు కృషి చేస్తున్న వారందరికీ ఆయన అభినందించారు.
విజయరాం మాట్లాడుతూ ప్రతి నెలా 25 మంది గర్భవతులకు కులాకార్ బియ్యం పంపిణీ చేస్తామన్నారు. ఆ బియ్యం సంకల్ప కళా గ్రామం ద్వారా అందజేస్తాం అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మల్లిఖార్జునరావు, విశాఖపట్నం జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్ర ధామా, కాకినాడ జిల్లా అటవీశాఖ అధికారి రామచంద్ర రావు, జి విఎంసి అడిషనల్ కమిషనర్ నల్లనయ్య, వృక్ష మిత్ర అవార్డు గ్రహీత మందపాటి రామరాజు, దేవస్థానం ఇఓ జె. వెంకటరావు, తిరుపతి నుంచి వచ్చిన వంశీప్రియ, డాక్టర్ సుశీల మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ అధ్యక్షులు ఎం ఆర్ ఎన్ వర్మ, మేంగొమేన్ అప్పాజీ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, కోకో అండ్ కేన్ రాజశేఖర్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు పాల్గొన్నారు
Breaking News

Subscribe our Newsletter