ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ, ఏలూరు జిల్లాకేంద్ర గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణశిబిరం 

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ, ఏలూరు జిల్లాకేంద్ర గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణశిబిరం 

29/April/2026 20:56    Share:   

ఏలూరు, [ప్రతినిధి] : కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ, ఏలూరు జిల్లాకేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిక్షణశిబిరం (సమ్మర్ క్యాంప్) రెండవ రోజు బుధవారం ఎంతో వినోదాత్మకంగా సాగింది. ఈ శిక్షణ తరగతులకు చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ రోజు ఉదయం ముందుగా చిన్నారులకు పుస్తక పఠనంలో నీతికథలు చదివించారు. అనంతరం సామాజిక కార్యకర్త చలసాని వెంకట సురేంద్ర (పెప్సి) రిసోర్స్ పర్సన్గా పాల్గొని, చిన్నారులకు ‘బాల్యదశ నుండే ఏకాగ్రతను పెంపొందించుకోవడం ఎలా?’ అనే అంశాలపై శిక్షణ ఇస్తూ మెళకువలు నేర్పించారు. ఈ సందర్భంగా సమ్మర్ క్యాంప్లో గ్రంథాలయాలను వినియోగించుకొని భవిష్యత్తులో మంచి విజ్ఞానవంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు.అనంతరం ఏలూరుకు చెందిన ప్రముఖ ఆర్టిస్ట్, కార్టూనిస్ట్ సుజయ కృష్ణ చిన్నారులకు అంకెలతో బోర్డుపై కార్టూన్ బొమ్మలు వేసి, ఈ రెండు బొమ్మల అర్థం ఏమిటో వివరిస్తూ శిక్షణ అందించారు.చిన్నారులకు మధ్యలో విరామ సమయంలో మాజేటి వినయ్, మాజేటి స్రవంతి, మాజేటి గార్గి సాయి, వారి కుటుంబ సభ్యులు వారి తరపున స్నాక్స్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బి. రమేష్ బాబు చిన్నారులకు జనరల్ నాలెడ్జ్పై క్విజ్ పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ ఎ. నారాయణరావు శిక్షణ తరగతులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో జిల్లాకేంద్ర గ్రంథాలయ సిబ్బంది, బి. రమేష్, ఎండి అస్లామ్ పాషా, బివిఎస్ లక్ష్మి, చిన్నారుల తల్లిదండ్రులు, చిన్నారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter