గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ – అనకాపల్లి రూరల్ పోలీస్ అనకాపల్లి జిల్లా, అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకరం గ్రామ పరిధిలోని ఎఫ్.సి. గోదాముల వెనుక ఉన్న కొండ ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులను అనకాపల్లి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి, వారి పై Cr.No. 27/2026 U/s 27(a) NDPS Act కింద కేసు నమోదు చేశారు. 09.02.2026 న మధ్యాహ్నం 4.00 గంటల సమయంలో, గంజాయి సేవిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు శ్రీ జి. రవి కుమార్, సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అనకాపల్లి రూరల్ పీఎస్, తన ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి, తహసీల్దార్, అనకాపల్లి ద్వారా మధ్యవర్తులను రప్పించారు. అనంతరం పోలీస్ సిబ్బంది మరియు మధ్యవర్తులతో కలిసి సాయంత్రం 5.00 గంటలకు సంఘటన స్థలంపై దాడి నిర్వహించారు. దాడి సమయంలో ముగ్గురు వ్యక్తులు గంజాయి సేవిస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, వారిని వెంబడించి పట్టుకున్నారు. విచారణలో వారి వివరాలు ఈ విధంగా వెల్లడయ్యాయి: 1. ఉగ్గిన శేష మణికంఠ @ మణి (వయసు 29 సంవత్సరాలు) 2. జగ్గుపల్లి జగదీశ్ (వయసు 28 సంవత్సరాలు) 3. రాజపూడి ఆదిత్య సాయి వెంకటేష్ (వయసు 29 సంవత్సరాలు) వారి వద్ద నుండి: • A-1 వద్ద 20 గ్రాముల గంజాయి • A-2 వద్ద 15 గ్రాముల గంజాయి • A-3 వద్ద 15 గ్రాముల గంజాయి • మూడు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు మరియు ఒక లైటర్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు గంజాయిని విజయరామరాజు పేట కి చెందిన యర్రంసెట్టి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి నుండి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. చట్టపరమైన విధివిధానాలు పాటించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. విచారణలో A-1 పై గతంలో క్రిమినల్ కేసులు ఉన్నట్లు, పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు మరియు గంజాయి సరఫరా మూలాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.