ఏలూరు జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, IPS.
30/April/2026 17:26
Share:
పోలీస్ శాఖలో మహిళా కార్యదర్శుల తో ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో (MSK) ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు ఈ సందర్భంగా వారి విధులు, వారి యొక్క సమస్య లు మరియు పోలీసు శాఖలో వారికి ఉన్న అవకాశాలపై ఎస్పీ గారు దిశానిర్దేశం చేశారు.గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల ఉద్యోగ నిర్వహణ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుందని ఎస్పీ గారు స్పష్టం చేశారు.పోలీస్ స్టేషన్ లో రిసెప్షన్ కౌంటర్లు, కౌన్సిలింగ్ సెంటర్లు మరియు కంప్యూటర్ సంబంధిత పనుల్లో మహిళా కార్యదర్శుల సేవలను వినియో గించు కుంటామని తెలిపారు. ముఖ్యంగా రిసెప్షన్ డెస్క్ వద్ద బాధిత ప్రజలతో మర్యాదగా మాట్లాడి, వారి సమస్యలను వినడం ద్వారా సగం బాధను తగ్గించవచ్చని సూచించారు.ప్రమోషన్లు మరియు రిజర్వేషన్: పోలీస్ శాఖలో ఇతర శాఖల కంటే ఎక్కువ ప్రమోషన్ల కు అవకాశం ఉందని, రానున్న రోజుల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ద్వారా మరిన్ని అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.సైబర్ క్రైమ్ నివారణ, కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్లుగా మరియు సాఫ్ట్ స్కిల్స్ అవసరమైన విభాగాల్లో మహిళా కార్యదర్శుల ప్రావీణ్యతను పూర్తి స్థాయిలో ఉపయో గించుకుంటామన్నారు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులందరితో సమానంగా అన్ని సౌకర్యాలు వర్తిస్తాయని గుర్తుచేశారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ లోని భద్రత లోన్ల ద్వారా 5% వడ్డీకే రుణాలు, పిల్లలకు మెరిట్ స్కాలర్ షిప్‌లు మరియు పోలీస్ క్యాంటీన్ ద్వారా తక్కువ ధరకే నిత్యవసర వస్తువులు పొందే వెసులుబాటు ఉంటుందని వివరిం చారు.ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు మొదటగా గుర్తొచ్చేది పోలీస్ శాఖేనని, అటువంటి విభాగంలో పని చేయడం మహిళా కార్య దర్శులకు మరియు వారి కుటుం బాలకు ఎంతో గౌరవ ప్రదమని ఎస్పీ గారు కొనియాడారు.జిల్లాలోని 493 మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల రికార్డులను పారదర్శకత కోసం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోనే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.సమాజానికి ఉపయోగపడేలా, బాధ్యతాయుతమైన విధులను నిర్వర్తిం చడంలో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు చురుకైన పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ఎస్పీ గారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏ ఆర్ అదనపు ఎస్పీ శ్రీ జీ ముని రాజా గారు పోలీస్ ప్రధాన కార్యాలయం ఏ ఓ శ్రీ షేక్ మస్తాన్ గారు, సూపరింటెండెంట్ లు శ్రీమతి సువర్చల గారు శ్రీ పి నాగేశ్వరరావు గారు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి లు సిబ్బంది పాల్గొన్నారు