ఏలూరులో ఉద్యోగవకాశాల (జాబ్ మేళా)

ఏలూరులో ఉద్యోగవకాశాల (జాబ్ మేళా)

25/August/2026 20:16    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు,
ఏలూరు, ఆగస్టు 26: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధా కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు.
ఈ జాబ్ మేళా రాబోయే శనివారం (29-08-2026) న కె.పి.డీ.టీ స్కూల్, అశోక్ నగర్, ఏలూరు జిల్లాలో జరుగుతుందని ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎన్. జితేంద్ర బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ జాబ్ ఫెయిర్లో సుమారు 15 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, సుమారు 750 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.పదవ తరగతి, ఇంటర్, ఐ.టీ.ఐ, డిప్లొమా, డిగ్రీ, ఎం.బి.ఏ, పి.జి, బి.టెక్ వంటి విద్యార్హతలు కలిగి, 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు అర్హులని అధికారి తెలిపారు.ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎన్. జితేంద్ర బాబు నిరుద్యోగ యువతీ యువకులకు విజ్ఞప్తి చేశారు.
ఇతర వివరాలకు  8184887146, 9493482414 సంప్రదించవచ్చని,   (9988853335 - టోల్ ఫ్రీ) ఈ జాబ్ మేళాకు హాజరు అయ్యే అభ్యర్ధులు తమ బయడేటా మరియు  సర్టిఫికెట్స్ జీరాక్స్ లతో హాజరు కావాలన్నారు.
Breaking News

Subscribe our Newsletter