రామచంద్రమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం

రామచంద్రమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం

08/June/2026 18:37    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
 
యలమంచిలి బైపాస్ రోడ్ సమీపంలోని శ్రీ రామచంద్రమ్మ తల్లి ఆలయ కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పిళ్లా రమాకుమారి, విశాఖ డెయిరీ చైర్మన్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆడారి ఆనంద్ కుమార్ పాల్గొని ఆలయ అభివృద్ధి, భవిష్యత్ నిర్వహణపై చర్చించారు.
ఆలయానికి 300 మంది భక్తులను జీవితకాల దాతలుగా గుర్తించి, వారి నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.10,116 చొప్పున విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. ఈ విధంగా సమకూరే నిధులను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని ప్రతి రెండేళ్లకోసారి జరిగే అమ్మవారి ఉత్సవాలు మరియు ఆలయ నిర్వహణ ఖర్చులకు వినియోగించనున్నట్లు కమిటీ వెల్లడించింది.
ఈ సందర్భంగా ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, దాతల నుంచి సేకరించే రూ.30 లక్షలకు పైగా నిధులకు అదనంగా తాను వ్యక్తిగతంగా రూ.10 లక్షలు విరాళంగా అందజేస్తానని ప్రకటించారు. ఆ మొత్తాన్ని కూడా నిధిలో జమ చేసి, ఆలయ ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
 
అలాగే రూ.10,116 విరాళం అందజేసే జీవితకాల దాతలకు ప్రత్యేక గుర్తింపు కల్పించాలని నిర్ణయించారు. వారికి ఆలయంలో జీవితకాలం ఉచిత దర్శనం, అలాగే మెరుపుల పండుగ రోజున వీఐపీ గ్యాలరీలో ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోరుమిల్లి సుబ్బారావు, ఆడారి శంకరరావు, ఆడారి శ్రీధర్, మళ్ల కొండబాబు, కోటారు శ్రీరాములు, కర్రి జానకిరామ్, నగిరెడ్డి శ్రీను, కోటారు కొండబాబు, సుందరపు బాబ్జి, వియ్యపు అచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter