దివ్యాంగులకు మరో గుడ్ న్యూస్! సర్టిఫికెట్ల జారీ పూర్తిగా డిజిటల్ పద్దతిలో..

దివ్యాంగులకు మరో గుడ్ న్యూస్! సర్టిఫికెట్ల జారీ పూర్తిగా డిజిటల్ పద్దతిలో..

22/March/2026 20:17    Share:   

దివ్యాంగులకు మరో గుడ్ న్యూస్!సర్టిఫికెట్ల జారీ పూర్తిగా డిజిటల్ విధానంలో
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్ (సోషల్ మీడియా ఇంచార్జ్ ) యలమంచిలి :
రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వైకల్య సర్టిఫికెట్ల జారీ పూర్తిగా డిజిటల్ విధానంలోనే నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న విధానానికి మార్పులు చేస్తూ, మొత్తం 21 రకాల వైకల్యాలకు ఆన్లైన్ ద్వారా సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 13 రకాల జబ్బులకు డిజిటల్ విధానంలో, 3 రకాల జబ్బులకు మాన్యువల్ విధానంలో సర్టిఫికెట్లు ఇస్తుండగా, ఇకపై అన్ని సేవలను ఆన్లైన్‌లోకి తీసుకురానున్నారు.
కొత్తగా 5 రకాల జబ్బులు చేర్పు
రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ చట్టం ప్రకారం మరో 5 రకాల వైకల్యాలను చేర్చారు. అవి:
ఆమ్ల దాడి బాధితులు స్పీచ్ & లాంగ్వేజ్ డిసేబిలిటీ స్పెసిఫిక్ లెర్నింగ్ డిసేబిలిటీ ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ మల్టిపుల్ డిసేబిలిటీస్  స్లాట్ బుకింగ్ & వైద్య పరీక్షలు
ఈ నెల 25 నుంచి గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా స్లాట్ బుకింగ్ ప్రారంభం కానుంది. మార్చి 30 నుంచి ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
 వైకల్య శాతం పరిమితి తొలగింపు
ఇప్పటివరకు 40 శాతం వైకల్యం ఉన్నవారికే సర్టిఫికెట్లు జారీ చేయగా, ఇకపై వైకల్య శాతం ఎంత ఉన్నా సర్టిఫికెట్ అందించనున్నారు.
మాన్యువల్ విధానానికి ముగింపు
హేమోఫిలియా, తలసేమియా, సికిల్ సెల్ వంటి జబ్బులకు ఇస్తున్న మాన్యువల్ సర్టిఫికెట్లను కూడా పూర్తిగా ఆన్లైన్‌లోకి మార్చనున్నారు.
పారదర్శకతకు ప్రాధాన్యం
కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా వైకల్య శాతం నుంచి సర్టిఫికెట్ వరకు అన్ని ప్రక్రియలు డిజిటల్‌గా నిర్వహించబడతాయి. దీని ద్వారా పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter