మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళి అర్పించిన రెడ్డి అప్పల నాయుడు..

మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళి అర్పించిన రెడ్డి అప్పల నాయుడు..

12/April/2026 06:52    Share:   

సామాజిక సమానత్వానికి జ్యోతిని వెలిగించిన మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళి అర్పించిన రెడ్డి అప్పల నాయుడు..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు.
మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి సందర్భంగా శనివారం స్థానిక జూట్ మిల్లు సెంటర్ వద్ద ఉన్న పూలే గారి విగ్రహానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే గారు సామాజిక సమానత్వం, విద్యా విప్లవానికి పునాది వేసిన మహనీయుడని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళా విద్యాభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు భారత సమాజాన్ని మార్గనిర్దేశం చేసినవని కొనియాడారు.. సమాజంలో అసమానతలను తొలగించి, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఆయన ఆశయాలు నేటికీ ప్రాసంగికమని తెలిపారు. పూలే గారు చూపిన మార్గాన్ని అనుసరించడం ద్వారా సమానత్వ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు వీరంకి పండు, 44 వ డివిజన్ కార్పోరేటర్ పొలిమేర దాసు, నాయకులు సరిది రాజేష్,బోండా రాము నాయుడు, బొత్స మధు, కొండల ప్రసాద్, లక్కింశెట్టి కిరణ్, గొడవర్తి నవీన్, అచ్యుత్, కొండేటి రమేష్, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళులర్పించారు..
Breaking News

Subscribe our Newsletter