రేగుపాలెం శ్రీశ్రీశ్రీ మరిడమ్మ తల్లి పండుగ మహోత్సవం భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
29/April/2026 20:48
Share:
శ్రీశ్రీశ్రీ మరిడమ్మ తల్లి పండుగ మహోత్సవం భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు – భారీ అన్నసంతర్పణ, సాంస్కృతిక కార్యక్రమాలు. క్రైమ్ అనాల్సిస్ - టివియస్ ప్రకాష్ యలమంచిలి : యలమంచిలి మండలం రేగుపాలెం గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ మరిడమ్మ తల్లి ఆలయంలో నేడు పండుగ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రాజాన మహాలక్ష్మి, ఆమె భర్త శ్రీను మాట్లాడుతూ భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందాలని కోరారు.
ఆలయ ప్రాంగణంలో మధ్యాహ్నం భారీ అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా భజనలు, కోలాటాలు, ఆర్కెస్ట్రా, బుర్రకథ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మహాలక్ష్మి, కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు తెలిపారు.
రేగుపాలెం గ్రామంలో భక్తిశ్రద్ధల నడుమ నేడు పండుగ వేడుకలు సందడిగా కొనసాగనున్నాయి.