కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
నూజివీడు మండలం మిట్టగూడెం నుండి అన్నారావుపేట వరకు, అన్నవరం నుండి వెంకటాయపాలెం ఓగిరాల తండా వరకూ బుధవారం రూ 5.06 కోట్లతో రహదారులు అభివృద్ధికి భూమిపూజలు, శంకుస్థాపన శిలాఫలకాన్ని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆవిష్కరించారు. ముందుగా గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మంత్రి కొలుసు పార్థసారథి ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ పట్టణాలు ధీటుగా గ్రామాలు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టిందని తెలిపారు.లోటు బడ్జెట్ ఉన్నను డబుల్ ఇంజన్ సర్కారులో అభివృద్ధి, సంక్షేమానికి నిధులు కొరత లేదని,రెండు చిన్న గ్రామాల్లో రూ 5.06 కోట్లతో రహదారుకు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో నూజివీడు నియోజక వర్గానికి గ్రామీణ రహదారులకు అభివృద్ధికి ప్రత్యేక నిధులు రూ 14 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖ సీసీ రహదారులకు రూ 148 కోట్లు, ఆర్&బి శాఖ ద్వారా రూ 40 కోట్లతో పనులు పూర్తి చేసుకుంటున్నామని అన్నారు. అభివృద్ధి, నాణ్యతలో నిర్లక్ష్యానికి తావులేదని, నిర్ణీత సమయంలోగా పూర్తిచేసి ప్రజలకు వాడుకలోకి తీసుకురావాలని ఆదేశించారు. నూజివీడు నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలబెట్టడమే తన లక్ష్యమని, ప్రజలు రుణం తీర్చుకునేందుకు రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా కష్టపడి పనిచేస్తున్నానని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, రాష్ట్ర అభివృద్ధికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులుపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని, ప్రజా ధనంతో చేపడుతున్న పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికి వదిలేశారని, కూటమి ప్రభుత్వంలో జరుగుచున్న కార్యక్రమాలకు ఓర్వలేక అడ్డుతగులుతున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విధ్వంసం ప్రధానంగా కనిపించగా, కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. పరిపాలన దక్షతగల ముఖ్యమంత్రి చంద్రబాబు తోడుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారని వీరికి తోడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహాయ సహకారాలతో రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు సాగుతుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు అధికారులు, పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.