
యలమంచిలి నియోజకవర్గ కూటమి ముఖ్య నాయకుల సమావేశం – సీఎం చంద్రబాబు సోలార్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు పూర్తి సహకారం
అచ్చుతాపురంలోని ఎస్ కే ఆర్ ఫంక్షన్ హాల్లో యలమంచిలి నియోజకవర్గ కూటమి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, యలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీ ప్రగడ నాగేశ్వరరావు,యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ నెల 23వ తేదీ (గురువారం) నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సోలార్ పవర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన నిమిత్తం విచ్చేయుచున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూటమి నాయకులందరూ కలిసికట్టుగా భాగస్వామ్యం కావాలని కోరారు.