లబ్ధిదారుల ముంగిటకే పెన్షన్.. స్వయంగా పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి..
01/May/2026 13:37
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాల అమలు కొనసాగుతోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దానిలో భాగంగానే అర్హత కలిగిన వారందరికీ సామాజిక భద్రతా పెన్షన్లు అందిస్తోన్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతోందని ఆయన వెల్లడించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక 15వ డివిజన్‌లో కొనసాగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం టిడిపి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం డివిజన్‌లోని లబ్దిదారుల ఇళ్ళకు స్వయంగా వెళ్ళిన ఎమ్మెల్యే చంటి,,, వారికి పెన్షన్ సొమ్ములను అందజేశారు. ఇదేతరుణంలో వారి సాధకబాధకాలను స్వయంగా తెలుసుకుని వారిలో భరోసా నింపుతూ వచ్చారు. వారి సమస్యలు తెలుసుకున్న ఆయన,,, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపడతానంటూ వారందరిలోనూ పూర్తిస్థాయిలో ధైర్యం నింపారు. ఇదేసమయంలో పలువురు వృద్ధులు వారి సమస్యలు చెబుతూ భావోద్వేగానికి గురవ్వగా,,, అదిచూసి చలించిపోయిన ఎమ్మెల్యే చంటి వారిని ఓదార్చారు. అండగా ఉంటానంటూ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీకి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. ఈ అంశంపై అర్హులు కూడా పూర్తి అవగాహనతో మెలగాలని సూచించిన ఆయన,,, వారు నేరుగా 9030 300 627 నెంబర్‌లో సంప్రదించి, సలహాలు, సూచనలు పొందాలని సూచించారు. అలాగే ఇంటిస్థలానికి దరఖాస్తు చేసుకునే అంశంపై కూడా పలువురికి అవగాహన కల్పించామన్న ఆయన,,, వారికి కూడా న్యాయం చేసేందుకు అన్నివిధాలా కృషిచేస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకపక్క మౌలిక వసతుల కల్పనతో పాటూ మరోపక్క సంక్షేమ పథకాల అమలులోనూ కూటమి ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తూ ముందుకెళ్తోందని, అదే విధానాలు భవిష్యత్తులోనూ కొనసాగించనున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఆయన వెంట ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, క్లస్టర్ ఇంచార్జ్ చోడే వెంకటరత్నం, క్లస్టర్ కో ఇన్చార్జ్ కరణం గణేష్,డివిజన్ టిడిపి ఇంచార్జ్ కోనా మాణిక్యం, డివిజన్ కో ఇన్ఛార్జ్ కంచరాపు దేవేంద్ర,జనసేన ఇంచార్జ్ పైడి లక్ష్మణరావు, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, టిడిపి డివిజన్ అధ్యక్షులు ఆవుల చంద్రయ్య టిడిపి నాయకులు కూన రమణ, కిల్లి వాసు, నిడిగట్టి నాగరాజు, సుధీర్, అమ్మోరు బాబు తదితరులు పాల్గొన్నారు...