గోవాడ షుగర్ ఫ్యాక్టరీ చెరకు రైతుల బకాయిలు చెల్లింపుల విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం !
23/April/2026 09:43
Share:
అనకాపల్లి జిల్లాలో చోడవరం మండలంలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి చెరకు తోలిన రైతుల బకాయిలు చెల్లింపుల విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది కూటమి ప్రభుత్వాన్ని నమ్మి రైతులు కార్మికులు తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఎన్నికల సమయాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే గోవాడ చక్కర పరిశ్రమను ఆధునీకరణ చేయడం ఎప్పటికప్పుడు రైతు తీసుకొచ్చిన చెరకు బకాయిలు చెల్లించడం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఎన్నికల తర్వాత రైతులకు ఇవ్వాల్సిన చెరుకు బకాయి 31 కోట్లు కార్మికులకు ఇవ్వాల్సిన ఏడు కోట్లు మొత్తం 38 కోట్లు చెల్లించడంలో తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు కార్మికులకు తీరని అన్యాయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం రైతుల చెరుకు ద్వారా వచ్చినటువంటి పంచదారను అమ్ముకొని వచ్చిన డబ్బులను రైతు లేకపోతే బాధ పెడుతున్న ఫ్యాక్టరీని కూడా మూసేశారు కార్మికులను రోడ్డున పడేశారు తెలుగుదేశం పార్టీకి గెలిపించినందుకు రైతులకు కార్మికులకు తీరని అన్యాయం చేశారు,కుటమీ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నాయి చెరకు రైతు బకాయిలు చెల్లించడానికి కార్మికుల జీతాలకు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు ఇది చాలా అన్యాయం ఎండనక వాననక ప్రజల కడుపు నింపాలని కష్టపడి పని చేసిన రైతుకు అన్యాయం చేయడం మంచిది కాదు అనకాపల్లి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కలిసి రేపు రాంబిల్లి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని కలసి గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రైతుల కార్మికుల బకాయిలు చెల్లించాలని ముఖ్యమంత్రి గారిని ఏదో విధంగా ఒప్పించాలని అనకాపల్లి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ శాఖ డిమాండ్ చేస్తుంది మీ ముఖ్యమంత్రి గారితో మీరే మాట్లాడటానికి భయపడితే మీరు ప్రజలకి ఏమి న్యాయం చేస్తారు భయ పడకండి 25వేల మంది రైతుల కడుపు నింపిన వారవుతారు భయపడకుండా మాట్లాడండి కొణతాల హరినాథ్ బాబు అనకాపల్లి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్,వేగి మహాలక్ష్మి నాయుడు చోడవరం మండలం ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్