
అనకాపల్లి, : ఆన్‌లైన్ ద్వారా మందులు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలు – ముఖ్యంగా నకిలీ మందులు, కార్పొరేట్ సంస్థల అత్యధిక డిస్కౌంట్ల దుర్వినియోగం, గుత్తాధిపత్యం – వీటిని నిరసిస్తూ అఖిల భారత కెమిస్టుల సమాఖ్య (AIOCD) మే 19 జరిగిన సమ్మెకు అనకాపల్లి జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పూర్తి మద్దతు ప్రకటించింది.
దేశవ్యాప్తంగా మందుల దుకాణాలు మూసివేసి నిరసన తెలిపారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్లపై నియంత్రణ లేకపోవడంతో పేషెంట్ల చేతికి చేరే మందులు కూడా నకిలీగా మారే ప్రమాదం పెరిగిందని, ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని ఈ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఆన్‌లైన్లో మందుల అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలి
కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న అధిక డిస్కౌంట్లను నియంత్రించాలి (వీటి వలన రోగులు అనవసర మందులు వాడే ప్రమాదం తగ్గనుంది.)
నకిలీ మందుల అమ్మకాలను అరికట్టాలి – కేవలం లైసెన్స్ పొందిన ఫిజికల్ స్టోర్ల ద్వారానే మందులు విక్రయించాలి
GSR 220 (తేదీ 26-03-2020) నిబంధనను ఉపసంహరించుకోవాలి – ఈ నిబంధన ఆన్‌లైన్ విక్రయాలకు మార్గం సుగమం చేస్తుందని ఆందోళన
ఈ బంద్‌ను విజయవంతం చేసినదుకు ఆల్ ఇండియా అధ్యక్షులు జె.ఎస్. షిండే, ప్రధాన కార్యదర్శి రాజీవ్ సింఘాల్ ఆర్షం వక్తం చేసారు.
ఈ సందర్బంగా రాష్ట్రంలో ఏపీ అసోసియేషన్ అధ్యక్షులు పి. వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శి కె. కరుణ కుమార్ గుప్తా, కోశాధికారి సాధు ప్రసాద్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు వి. అప్పారావు, కార్యదర్శి ఎం.వి. ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ – "ప్రజలు ఆన్‌లైన్లో మందులు ఆర్డర్ చేసినప్పుడు వారు నకిలీ ఉత్పత్తులకు గురవుతున్నారు. ఇది చిన్న విషయం కాదు, ప్రాణాంతకం. లైసెన్స్ లేని విక్రేతల చేతిలో రోగుల జీవితాలు బందీ కాకూడదు" అని వివరిచారు..
ప్రజలు ఈ విషయాన్ని గమనించి, సురక్షితమైన మందుల కోసం స్థానిక నమ్మకమైన కెమిస్టు దుకాణాలను ఆశ్రయించాలని వారు కోరారు.