ఏలూరు పర్యటనలో హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత..

ఏలూరు పర్యటనలో హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత..

10/April/2026 07:59    Share:   

ఆత్మీయ స్వాగతం పలికిన ఏపీఎస్ ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,
ఏలూరు:- గురువారం ఏలూరు జిల్లాలో హోం శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు సుడిగాలి పర్యటన చేశారు.. ఏలూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారికి ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు ఘన స్వాగతం పలికారు.. నూతనంగా నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని జిల్లా టిడిపి అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఉంగుటూరు ఎమ్మెల్యే పట్సమట్ల ధర్మరాజు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి.అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు..ముందుగా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం అప్పన్నవీడు గ్రామంలోని అభయాంజనేయ స్వామి వారిని హోం మంత్రి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు.అనంతరం ఏలూరులో నూతనంగా నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని హోం మంత్రి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ గారు, జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి గారు,రాష్ట్ర అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు, వడ్డెర కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి గారు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ గారు, ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు గారు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter