యలమంచిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం
18/April/2026 20:15
Share:
యలమంచిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ మరియు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరావు అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పల చలపతిరావు హాజరయ్యారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించి విడతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈనెల 20న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన ఉంది కావున నియోజవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈ జన్మదినం వేడుకను ఘనంగా నిర్వహించాలని, అదేవిధంగా ఈనెల 23వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యలమంచిలి నియోజకవర్గంలో కంపెనీ శంకుస్థాపన నిమిత్తం విచ్చేయుచున్నారని ఆ పర్యటనకు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గొర్లె. శివన్నారాయణ మూర్తి, లాలం భరత్, ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, పీల. తులసీరామ్, పెంటకోట విజయ్ గవర కార్పోరేషన్ డైరెక్టర్ భీమరశెట్టి శ్రీనివాసరావు,సీనియర్ నాయకులు రాజాన సూర్య నాగేశ్వరరావు,జిల్లా అధికార ప్రతినిధి దాడి రమేష్, ప్రధాన కార్యదర్శి ఆడారి. ఆదమూర్తి, క్లస్టర్ ఇంచార్జ్ కరణం. రవికుమార్ ,సేనాపతి రాజా మహేష్ , దేవ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.