యలమంచిలి: రాంబిల్లిలో వివాహిత సాయి తేజ(23) ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ నర్సింగరావు మంగళవారం తెలిపారు. సిఐ నర్సింగరావు తెలిపిన వివరాలు ప్రకారం శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరుకు చెందిన తేజ పిల్లలు పుట్టలేదని మనస్తాపంతో సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ఘటనపై మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ నర్సింగరావు తెలిపారు.