ఏలూరు జిల్లా ఏలూరు ఆదిత్య డిగ్రీ కాలేజీలో న్యూ మార్క్స్ కుంగ్ఫూ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పిల్లలకు బెల్ట్ ప్రమోషన్ ప్రధానోత్వానికి ముఖ్యఅతిథిగా ఏలూరు త్రీ టౌన్ సిఐ కోటేశ్వరరావు హాజరయ్యారు.ఆయన మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ఎన్నో దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి ఆత్మ రక్షణ విద్య తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, అలాగే చనిపోతున్నారు. కానీ ఈ పిల్లలు చిన్నతనం నుండే ఒక దృఢ సంకల్పంతో ఆత్మ రక్షనాకు కుంగ్ఫూ నేర్చుకుంటున్నారు అలాగే శరీర దారుధ్యాన్ని పెంపొందించుకుంటున్నారు.ఈ విద్యను ఏలూరు రాఘవ మాస్టర్, ఆయన భార్య సరస్వతి, వారి కుమార్తె నికేత శ్రీ ఆధ్వర్యంలో ఎంతో మంది చిన్నారులు ఈ కుంగ్ఫూ విద్యలోని నైపుణ్యానీ,వారికి ఆత్మరక్షణకు ఎలా వినియోగించుకోవాలో తెలియజేస్తూ ఎంతోమంది పిల్లలను తీర్చిదిద్దుతున్నారు అని సి ఐ వారిని ప్రశంసించారు.