ఘనంగా రెన్యూవబుల్ ఎనర్జీ గ్లోబల్ ప్రాజెక్ట్ శంకుస్థాపన …!
23/April/2026 21:13
Share:
రెన్యూవబుల్ ఎనర్జీ గ్లోబల్ ప్రాజెక్ట్ శంకుస్థాపన క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్ : యలమంచిలి నియోజకవర్గంలోని రాంబిల్లి మండలంలో భారీ స్థాయిలో ఏర్పాటు చేయనున్న రెన్యూవబుల్ ఎనర్జీ గ్లోబల్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యన్ . చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు , మంత్రి కొల్లు రవీంద్ర , ఎమ్మెల్యేలు సుందరపు విజయ్ కుమార్ , బండారు సత్యనారాయణ మూర్తి , ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.రూ.82 వేల కోట్ల వ్యయంతో అమలు చేయనున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లో భాగంగా, రాంబిల్లిలో రూ.5400 కోట్లతో 6 గిగావాట్ సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రాంతీయంగా ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరగనున్నాయి. అంతేకాకుండా, శుద్ధ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ముందంజలో నిలిచే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.